Bumchik Babloo Mayaa: రహస్యంగా యూట్యూబర్ పెళ్లి.. ఆర్య సమాజ్‌లో..

Bumchik Babloo Mayaa: ప్రస్తుతం సినీ సెలబ్రిటీలకు ఎంత ఫాలోయింగ్ ఉందో.. కొందరు యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ఈమధ్య ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుంటే చాలు అన్నట్టు చాలామంది భావిస్తున్నారు. అలా యూట్యూబ్ ఛానెల్‌తో ఫేమస్ అయిపోయిన యూట్యూబర్ బమ్‌చిక్ బబ్లూ. అయితే ఈ యూట్యూబర్ ఎవ్వరికీ తెలియకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మొదట ఓ పెద్ద యూట్యూబ్ ఛానెల్‌లో వేరే యూట్యూబర్స్ చేసే వీడియోల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు బబ్లూ మాయ. అయితే కొన్నాళ్ల తర్వాత తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. ఈ యూట్యూబ్ ఛానెల్ కొంతకాలం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అయ్యింది. కొన్నాళ్ల నుండి యూట్యూబ్‌లో కూడా పోటీ పెరిగిపోవడంతో బబ్లూ కాస్త వెనక్కి తగ్గాడు.
యూట్యూబర్‌గా గుర్తింపు సంపాదించుకున్న బబ్లూ ఎవరికీ తెలియకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com