Naga Chaitanya : నాగ చైతన్యకు 100 కోట్లు ప్రామిస్ చేసిన నిర్మాత

Naga Chaitanya :  నాగ చైతన్యకు 100 కోట్లు ప్రామిస్ చేసిన నిర్మాత
X

ఏ సినిమా కలెక్షన్స్ అయినా కంటెంట్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. వేదికల మీదో, ప్రెస్ మీట్స్ లోనో లేక.. ఇంటర్వ్యూస్ లోనో వాళ్లకు వాళ్లు చెప్పుకునే డైలాగ్స్ మీద ఆధారపడి ఉండవు అనేది అందరికీ తెలుసు. కానీ ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి బిగ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఓ ప్రొడ్యూసర్.. తమ సినిమా వంద కోట్ల క్లబ్ చేరుతుంది అని చెప్పడం వారి కాన్ఫిడెన్స్ కే నిదర్శనం. అయితే ఇక్కడ కంటెంట్ గురించి మాట్లాడ్డం లేదు వాళ్లు. కేవలం ఆ హీరో గతంలో తనకు చేసిన ఓ ఫేవర్ కు రిటర్న్ గిఫ్ట్ గానే చైతూ సినిమాను వంద కోట్ల క్లబ్ లో నిలబెడతా అని తొడగొట్టినంత పనిచేశాడు. ఆ నిర్మాత ఎవరో తెలుసు కదా.. యస్.. బన్నీ వాసు.

ముందు నుంచీ గీతా ఆర్ట్స్ క్యాంప్ లో ఉన్న బన్నీ వాసు.. తండేల్ సినిమా నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒకప్పుడు అతను కో ప్రొడ్యూసర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు.. ఫస్ట్ టైమ్ తన పేరును నిర్మాతగా వేసేందుకు ఒప్పుకున్న హీరో నాగ చైతన్యట. అది 100 పర్సెంట్ లవ్ అనే సినిమాకు. ఆ కృతజ్ఞత కొద్దీ ఇప్పుడు తను ఆయనను వంద కోట్ల క్లబ్ లో చేరుస్తా అంటూ అక్కినేని ఫ్యాన్స్ స్ట్రాంగ్ ప్రామిస్ కూడా చేశాడు. సో.. రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలేమో కానీ.. ఆల్రెడీ ఆ మూవీ దర్శకుడు వంద కోట్ల క్లబ్ లోనే ఉన్నాడు. లేటెస్ట్ గానే సాయి పల్లవి కూడా ఆ క్లబ్ లోకి ఎంటర్ అయింది. ఇది కూడా తమ సినిమాకు ప్లస్ అవుతుందంటున్నాడు కానీ.. ఒక బలమైన కథ, కథనాలతో వస్తున్నాం.. ప్రేక్షకులను భావోద్వేగాలకు గురి చేసే కంటెంట్ మా దగ్గర ఉంది అని మాట వరసక్కూడా అనలేదు. అంటే ఆల్రెడీ అది నిజమే అయినప్పుడు మళ్లీ మళ్లీ చెప్పడం ఎందుకు అనుకున్నాడో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ.. బన్నీ వాసు చేసిన ప్రామిస్ మాత్రం కాస్త.. కాస్తేంటీ.. చాలా పెద్దదే.

Tags

Next Story