Businessman Re release : ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న 'సూర్యా భాయ్'

Businessman Re release : ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న సూర్యా భాయ్
రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న 'బిజినెస్ మేన్' రీరిలీజ్.. మరోసారి మహేశ్ దూకుడు

రీసెంట్ డేస్ లో టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'బిజినెస్ మేన్' విడుదలకు సిద్దమైంది. ఈ మూవీ మరోసారి ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆల్రెడీ రిలీజైన సినిమాలే అయినా.. ప్రేక్షకులు మాత్రం మళ్లీ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో మేకర్స్ కూడా అప్పుడెప్పుడో రిలీజై మంచి హిట్ కొట్టిన సినిమాలను మళ్లీ విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు 'పోకిరి', రామ్ చరణ్ 'ఆరెంజ్', ఎన్టీఆర్ 'సింహాద్రి', అల్లు అర్జున్ 'దేశముదురు', ఇటీవలే సూర్య 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' సినిమాలు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడ్డాయి. వీటికి రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో వస్తోంది.

ఇక మహేశ్ బాబు 'బిజినెస్ మేన్' విషయానికొస్తే.. 2012లో రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమాలో మహేశ్ బాబు.. సూర్య భాయ్ పాత్రలో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుండడంతో.. అందరి దృష్టీ కలెక్షన్ల పైనే పడింది. ఇప్పటిదాకా ఈ సినిమా కేవలం అడ్వాన్స్ ద్వారానే ఏకంగా రూ. 2 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే బిజినెస్ సినిమాపై ప్రేక్షకులకు ఎంత అభిమానం ఉందొ పూర్తిగా అర్థమవుతోంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు 20 లక్షల పైగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల మాత్రమే వచ్చాయని సమాచారం తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే 'బిజినెస్ మేన్' చిత్రం ఇప్పటి దాకా దాదాపు రూ.3 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే అన్ని షోలు ఫుల్ అయిపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోన్న విషయం.

మరో ముఖ్య విషయమేమిటంటే.. ఇప్పటి దాకా రీరిలీజ్ అయిన అన్నీ సినిమాల్లో అతి తక్కువ సమయంలో ఈ రేంజ్ స్పీడ్ లో టికెట్స్ బుక్ అవడం ఇదే మొదటిసారి అని సమాచారం తెలుస్తోంది. మరి రిలీజ్ తరువాత బిజినెస్ మ్యాన్ సినిమా ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇక తాజాగా మహేశ్ బాబు ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని రేజ్ ఆఫ్ సూర్యాభాయ్ పేరుతో లిరికల్ వీడియోను ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఆదిత్య మూజికల్ లో విడుదల కానున్నట్టు వెల్లడించారు. అంతా రెడీగా ఉండడంటూ ఆయన తెలిపారు. దాంతో పాటు రేపు బిజినెస్ మేన్ 4కె క్వాలిటీలో థియేటర్లలో విడుదల కానుందని కూడా మరో సారి నొక్కి చెప్పాడు.




Tags

Read MoreRead Less
Next Story