SVCC37 : డీజే టిల్లు కొత్త మూవీ షురూ.. హీరోయిన్ ఎవరంటే..

SVCC37 : డీజే టిల్లు కొత్త మూవీ షురూ.. హీరోయిన్ ఎవరంటే..
కొత్త సినిమా స్టార్ట్ చేసిన సిద్దు జొన్నలగడ్డ..

'డీజే టిల్లు' తర్వాత 'టిల్లు స్క్వేర్' తో మరో సెన్సేషన్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ అప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశాడు. 2022లో ఓ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘డీజే టిల్లు‘ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సిద్దు సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఇది రొమాంటిక్, క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లను సైతం రాబట్టింది. దీంతో సిద్దూకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సిద్దు హీరోగా మరో సినిమా లాంచ్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. SVCC బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ వేడుకకు నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దర్శకుడు కార్తీక్ దండు హాజరయ్యారు. ప్రొడ్యూసర్ దిల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.


లవ్ స్టోరీలను అద్భుతంగా తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ తనకు తానేసాటి. అఖిల్ అక్కినేని తో అప్పట్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి ప్రేక్షకులను అలరించారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధు కెరీర్ కు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించే ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ను హీరోయిన్ తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇక సిద్దు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డీజే టిల్లుకు సీక్వెల్ గా రాబోతున్న 'టిల్లు స్క్వేర్' డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘డీజే టిల్లు’ మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తే, సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా టిల్లు చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తెరకెక్కించబోతున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


Tags

Read MoreRead Less
Next Story