NTR - Vetrimaran : వెట్రిమారన్ కథల్లో ఎన్టీఆర్ ఇమడగలడా..?

NTR - Vetrimaran :  వెట్రిమారన్ కథల్లో ఎన్టీఆర్ ఇమడగలడా..?
X

మనమేమో.. తొడలు కొట్టే బ్యాచాయె.. అతనేమో కథలు చెప్పే బ్యాచాయె.. ఇతను మ్యాన్ ఆఫ్ మాసెస్.. అతను మ్యాన్ ఫర్ డౌన్ ట్రాడన్.. ఇక్కడేమో ఎక్స్ ట్రీమ్.. అక్కడేమో మట్టి వాసన.. ఎట్టా చూసినా ఈ రెండు భిన్న కోణాలు. అలాంటి రెండు కోణాలు కలవడం అనేదే దాదాపు అసాధ్యం అయితే.. కలిస్తే శతాబ్ధం చెప్పుకునే సినిమా అయితేనే సెట్ అవ్వుద్ది. మరి ఇదంతా ఎవురి గురించి అనుకుంటుండారేమో.. అదే మన చిన్న ఎన్టీవోడు.. తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో పనిచేయాలని తెగ తాపత్రయం పడుతున్నాడు గందా.. అసలు ఇతగాడు అతగాడి కథల్లో సెట్ అవుతాడా అనేదే చాలామందికి శానా పెద్ద డౌటింగ్.

ఇండియాలోని బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు. అందులో డౌట్ లేదు. కానీ స్టార్స్ తో సినిమాలు అంటే ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేయాలి అనేది కమర్షియల్ సినిమా అనఫిషియల్ రూల్స్ లో ఒకటి. ఇలాంటి రూల్స్ మధ్య పనిచేయడం ఇష్టం లేని దర్శకుడు వెట్రి మారన్. మొదట్నుంచీ అతని కథలు చూశాం కదా. అంతెందుకు నారప్ప అనే వెంకటేష్ సినిమా అతనిదే కదా అసురన్.. అని ధనుష్ తో చేశాడు. అక్కడి కథలోని ఒరిజినాలిటీకి.. నారప్పలోని కథనానికి ఏవన్నా సంబంధం ఉందా.. అతను ఏదైతే తన కథకు ఆత్మ అని భావించాడో.. దాన్ని నారప్పలో సంపేశారు. మరి వెంకటేష్ లాంటి టాలీవుడ్ హీరో కోసమే అలా చేస్తే.. ఎన్టీఆర్ లాంటి ప్యాన్ ఇండియా హీరో కోసం ఎన్ని మార్పులు చేయాలి. ఆ మార్పులకు ఎన్టీఆర్ సరే అంటాడా.. అంటే అభిమానులు అతని ఒపీనియన్ గౌరవించి వెట్రిమారన్ చెప్పే కథకు పట్టం కడతారా..? ఇన్ని డౌట్స్ ఉన్నాయి.

అవున్లే.. మనోళ్లకు తగ్గించి పక్కోళ్లని పొగిడితే కాసింత కోపం వస్తుంది. నిజమే వెట్రిమారన్ కథల్లో నటించే సత్తా వెయ్యి శాతం ఎన్టీఆర్ లో ఉంది. అది కాదన్లేని నిజం. కానీ ఆ సత్తాను అలాగే అంగీకరించే శక్తి బాక్సాఫీస్ కూ ఉండాలి. వెట్రిమారన్ కథ అంటే రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. హీరోల ఆహార్యం నుంచి ఆంగికం వరకూ వేరే ఉంటుంది. బ్యాక్ డ్రాప్ ల నుంచి బ్యాక్ ఎండ్ స్టోరీస్ వరకూ ఓ బలమైన థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ఖచ్చితంగా అణిచివేయబడ్డ జనం గురించే ఉంటుంది.. అదీ సహజంగా కనిపిస్తుంది. ఈ సహజత్వాన్ని మనవాళ్లు ‘సాంబారుగాళ్ల అతి’అని సులువుగా కొట్టి పడేస్తారు. మరి మనదైన కథ చెప్పాలంటే వెట్రి మారన్ కు ఇక్కడి సమాజం తెలియాలి. తెలియదు అనుకోలేం. కానీ దాన్ని మన హీరో అలాగే అంగీకరించగలడా అనేది అసలు పాయింట్. అంచేత ఈ కాంబోలో సినిమా సెట్టవ్వాలంటే అభిమానులు, కమర్షియల్ మీటర్స్, హీరో ఇమేజ్, బాక్సాఫీస్ లెక్కలు.. ఇవన్నీ పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ అయితే తప్ప వర్కవుట్ కాదు.

కాకపోతే ది బెస్ట్ టాలెంటెడ్ పీపుల్ కలిసి వర్క్ చేయాలుకోవడం గొప్ప విషయం. వెట్రితో సినిమా చేస్తే ఎన్టీఆర్ లోని ది బెస్ట్ ‘ఆర్టిస్ట్’ను ప్రపంచం చూస్తుంది. అలాగే వెట్రిమారన్ కూ ఓ గొప్ప నటుడితో పనిచేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఎక్స్ ట్రీమ్ లీ టాలెంటెడ్ కాంబోలో సినిమా రావాలనే మనమూ కోరుకుందాం.

Tags

Next Story