Devara : సెప్టెంబర్ 27వరకు నన్ను బతికించండి.. దేవర సినిమా చూడాలన్న క్యాన్సర్ పేషెంట్
జూనియర్ ఎన్టీఆర్-సైఫ్ అలీఖాన్-జాన్వీ కపూర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' సినిమా కోసం అభిమానులు పిచ్చెక్కిపోయేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరడం వైరల్ అవుతోంది.
ఏపీకి చెందిన కౌశిక్ కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. తిరుపతిలో కౌశిక్ డిగ్రీ వరకు చదివారు. ఆయన తండ్రి టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తూ వినాయక నగర్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. తమ కుమారుడికి చిన్నప్పటినుంచి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని..చివరి కోరికగా దేవర చూడాలని అడుగుతున్నాడని చెప్పారు.
సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు ఆ అభిమాని. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక అంటూ కౌశిక్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. ఈ వీడియోను షేర్ చేస్తున్న తారక్ అభిమానులు ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com