Samantha : నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత

Samantha : నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత
X
Samantha : చైతూతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.

Samantha : చైతూతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. టూర్స్, లేటేస్ట్ ఫోటోస్, మోటివేషనల్ కోట్స్, మూవీ అప్డేట్స్‌‌తో అభిమానులకి ఎప్పుడు టచ్ లోనే ఉంటోంది. సామ్ ఏదైనా పోస్ట్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా కేరళకి వెళ్ళిన సామ్.. అక్కడ వేకేషన్‌లో భాగంగా దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక తన స్నేహితురాలితో బీచ్‌ ఒడ్డున దిగిన ఓ ఫోటోను సామ్ షేర్ చేస్తూ... 'నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను' అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. దీంతో పాటు 'బెస్ట్‌ ఫ్రెండ్స్‌' అనే హాష్‌ ట్యాగ్ జోడించింది.

ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికి వచ్చేసరికి గతేడాది అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ చేసిన 'శాకుంతలం' మూవీ రిలీజ్‌‌కి రెడీ అవుతోంది.

ప్రస్తుతం సామ్ యశోద చిత్రంతో పాటుగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్నారు.

Tags

Next Story