RRR: నాటు పాటకు స్టెప్పులేస్తారా.. క్యాప్ జెమినీ ఛైర్మన్ ఛాలెంజ్

RRR: ఆయనో సాప్ట్ వేర్ కంపెనీకి ఛైర్మన్. అయితేనేం ఆయన్నీ ఆకర్షించింది రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ లోని నాటు పాట.. అయినా ఆ పాటకు కాలు కదపని వారెవరు.. పాలు తాగే పాపాయి నుంచి పండు ముదుసలి వరకు నాటు పాటకు స్టెప్పెయ్యాలని చూశారు.. సోషల్ మీడియా అంతా దుమ్ముదులిపేశారు..
కాగా ఇదే పాటకు ఛాలెంజ్ విసిరారు ప్రముఖ వ్యపార వేత్త క్యాప్ జెమినీ ఛైర్మన్ పాల్ హెర్మెలిన్. ఆఫీస్ పని మీద భారత్ కు వచ్చిన ఆయన.. స్నేహితుడి సలహా మేరకు నాటు పాటను వీక్షించారు. హిందీ వెర్షన్ లో ఈ సాంగ్ వీడియో చూసి ఫిదా అయ్యారు.. తన భారతీయ మిత్రులకు ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ పాటకు మీరూ డ్యాన్స్ చేయగలరా అంటూ.. ఈ వారం వీడియోలను ఆహ్వానిస్తున్నా అని ఆయన తన లింక్డిన్ అకౌంట్ లో షేర్ చేశారు.
బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రామ్ భీమ్ గా రామ్ చరణ్, తారక్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి నటించారు.. 45 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు టాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com