Captain Miller Teaser: స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో వస్తోన్న ధనుష్

Captain Miller Teaser: స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథతో వస్తోన్న ధనుష్
కెప్టెన్ మిల్లర్ టీజర్.. ఇంతకు మునుపెన్నడూ చూడని కొత్త అవతార్ లో ధనుష్

హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన రాబోయే సినిమా 'కెప్టెన్ మిల్లర్' కు సంబంధించిన టీజర్‌ను అర్ధరాత్రి రిలీజ్ చేశారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ వీడియోలో ధనుష్ ఇంతకుమునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపిస్తున్నాడు.

జూలై 28న ధనుష్ 40వ పుట్టినరోజు సందర్భంగా , ఆయన నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'కెప్టెన్ మిల్లర్' టీజర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. జూలై 28న తెల్లవారుజామున, సాని కాయిదం ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్ ఈ వీడియోను వదిలారు. ఈ టీజర్‌లో ధనుష్.. పొడవాటి గడ్డం, పొడవాటి జుట్టుతో చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతని మెడ చుట్టూ నల్లటి దారం లాంటి చోకర్‌తో అదిరిపోయే అవతారలో అలరిస్తున్నాడు. ధనుష్ ఈ టీజర్‌లో ఒక భారీ రైఫిల్ ఆయుధాన్ని మోస్తూ కనిపించాడు. ఈ సినిమా 1930-40ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందినట్టు టీజర్ ను చూస్తే తెలుస్తోంది. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ ను చేతిలో పట్టుకుని ధనుష్ కనిపించడం ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటోంది. 100 సెకన్స్ లోపు నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రధాన పాత్రలన్నీ చూపించినట్టు తెలుస్తోంది.టీజర్‌లో శివ రాజ్‌కుమార్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, RRR ఫేమ్ ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ కూడా కనిపించారు. మొత్తానికి కథ రివీల్ చేయనప్పటికీ సూపర్ యాక్షన్ డ్రామాని రెడీ చేసినట్లు అర్థమవుతుంది. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ యాక్షన్ డ్రామా కోసం సత్యజ్యోతి ఫిలింస్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఇక ధనుష్ ఈ టీజర్ వీడియోలో.. గొడ్డలితోనే కాకుండా తుపాకీతోనూ తూటాలు వదిలిన తీరు అద్భుతంగా అనిపిస్తోంది.

ఈ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అతను తండ్రిగా, కొడుకుగా కనిపిస్తాడని సమాచారం. ఇక ఈ తమిళ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ రచన, దర్శకత్వం వహించారు, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు.. వివేక్, అరుణ్‌రాజా కామరాజ్, ఉమాదేవి, కబేర్ వాసుకి తమ సాహిత్యం జోడించదా.. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం డిసెంబర్ 2023లో విడుదల కానుంది. ధనుష్‌తో పాటు ఈ చిత్రంలో మార్క్ బెన్నింగ్టన్, నాసర్, శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుల్మోహన్ లాంటి పలువురు ఇతర తారలు ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story