Akhanda box office collection: బాలయ్య దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. వకీల్‌సాబ్ అవుట్..

Akhanda box office collection: బాలయ్య దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. వకీల్‌సాబ్ అవుట్..
Akhanda box office collection: కలెక్షన్ల పరంగా చూసినా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా అఖండ చరిత్ర సృష్టించింది.

Akhanda box office collection: అఖండ సినిమాతో మరోసారి రికార్డులు బ్రేక్ చేశాడు బాలకృష్ణ. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. కలెక్షన్ పరంగా చూసినా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా అఖండ చరిత్ర సృష్టించింది. రొటీన్ కథే అయినా బోయపాటి డైరెక్షన్‌‌లో కొత్తగా తెరకెక్కించారు.. బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం అఖండ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.

ఈ మధ్య కాలంలో థియేటర్‌కి వెళ్లాలంటే భయపడుతూ ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో సినిమా చూస్తున్నారు. కానీ అఖండ సినిమా మళ్లీ థియేటర్లకు జనాలను రప్పించింది. థియేటర్లలో ఫ్యాన్స్ గోలల మధ్య సినిమా చూసి ఎంజాయ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా అని కొందరు ఫస్ట్ షో సినిమాకి వెళ్లినా,, బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఆ డైలాగులు వినడానికి మళ్లీ థియేటర్లవైపు పరుగులు తీస్తున్నారు.

మొత్తానికి అభిమానులు ఒక్క రోజులోనే రెండు సార్లు సినిమా చూసేసారు. 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగా ఉంటుంది. కానీ అఖండ అక్కడ కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ రికార్డులను సైతం దాటేసి దూసుకుపోతోంది అఖండ. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాలయ్య సినిమాకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అక్కడ సినిమా ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్స్ వచ్చాయి. అంటే దాదాపు 2.75 కోట్లు. బాలయ్య కెరీర్‌లోనే ఇది మూడో బెస్ట్ ఓపెనింగ్ ఇది.

గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు 3.74 లక్షల డాలర్స్, గౌతమీ పుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్స్ వసూలు చేసింది. తాజాగా అఖండ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగులో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేస్తే, నాగచైతన్య, సాయి పల్లవిల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్స్ వసూలు చేసింది.

ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్‌ను అఖండ సినిమా క్రాస్ చేసింది. మాస్ హీరోకి పక్కా అర్థం చెప్పిన బాలయ్య అఖండ తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Tags

Read MoreRead Less
Next Story