Vishwak Sen: హీరో విశ్వక్‌సేన్‌పై కేసు.. చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్‌లో డిమాండ్..

Vishwak Sen: సినిమా ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేశారని నటుడు విశ్వక్‌సేన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో కేసు నమోదు అయింది. హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. సినిమా ప్రచారం పేరిట ప్రాంక్ వీడియోతో న్యూసెన్స్ క్రియేట్ చేశారని ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. సినిమా ప్రచారం పేరుతో పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్లు చేయనీకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్ఆర్‌సీని కోరినట్టు తెలిపారు.హీరోలు చేసే ఇలాంటి ప్రయత్నాలు యువతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, యూట్యూబ్‌లో ఉన్న ఇలాంటి వీడియోలన్నింటినీ తొలగించాలన్నారు. పెట్రోలు పోసుకుంటానంటూ ఒక యువకుడు నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ కారు ముందు పడడమే కాక 30 ఏళ్లు వచ్చినా అర్జున్ కుమార్ అల్లానికి పెళ్లి కాకపోవడం ఏమిటి? అంటూ.. నానా యాగి చేశాడు.
అతడిని అడ్డుకున్న విశ్వక్ సేన్.. సముదాయించి తన కారులో ఎక్కి పంపించాడు. ఆ తర్వాత విశ్వక్ సేన్ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగంగానే చేశారని చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రాంక్ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. బహిరంగ ప్రదేశంలో సినిమా ప్రచారం కోసం ఇంత హంగామా చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com