Mythri Movies : సంధ్య థియేటర్ ఘటనలో మైత్రీ మూవీస్ పైనా కేస్

పుష్ప 2 ప్రీమియర్స్ గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆ ఘటనలో అల్లు అర్జున్ ను ఏ 11 గా చేర్చి పోలీస్ లు కేస్ నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు బౌన్సర్స్ సప్లైయర్స్ మీద కూడా కేస్ లు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ ఘటనతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని నిర్మాతలను కూడా చేర్చారు పోలీస్ లు.
మైత్రీ మూవీ మేకర్స్ ని ఏ 18గా చేర్చుతూ కొత్తగా కేస్ నమోదైంది. దీని ద్వారా డైరెక్ట్ గా నిర్మాతలైన నవీన్ యొర్నేని, రవి కిషన్ యలమంచిలిపై కేస్ నమోదైందా లేక టెక్నికల్ గా ఇంకెవరి పేరైనా చేరుస్తారా అనేది చూడాలి. మొత్తంగా ఈ కేస్ ను ప్రభుత్వం కంటే పోలీస్ లే ఎక్కువ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు చాలామంది. ఓ వైపు రేవంత్ రెడ్డి తన పార్టీకి, ఎమ్మెల్యేలకు ఈ ఘటనపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలిచ్చాడు. అయినా కొందరు మాత్రం అదే పనిగా అల్లు అర్జున్ ను తిడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే కొడకా ఆంధ్రోడివి ఆంధ్రోడి లెక్క ఉండు అంటూ హీరోకు వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే వ్యవహారం చాలా దూరం పోయేలా ఉందంటున్నారు. మరి ఏ 18పై మైత్రీ మూవీస్ వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com