Ritabhari Chakraborty : బెంగాలీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్

మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై దర్యాప్తు చేపట్టాలని సీఎం మమతా బెనర్జీని .. బెంగాలీ నటి రితాభరీ చక్రవర్తి కోరారు.ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఇక్కడ కూడా జస్టిస్ హేమా కమిటీ వంటి దానిని ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని అభ్యర్థించారు. తనతో పాటు తనతోటి వారికి కొందరు నటులు, దర్శకనిర్మాతల చేతిలో భయానక అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే, ఆమె ఎవరిపేరును ప్రస్తావించలేదు.ఇలా వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తులు.. బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో ఎలాంటి సిగ్గులేకుండా పాల్గొనడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com