Hrithik Roshan : కహో నా ప్యాన్ హై కి 25 యేళ్లు

Hrithik Roshan :  కహో నా ప్యాన్ హై కి 25 యేళ్లు
X

గడిచిన మూడు దశాబ్దాల్లో బాలీవుడ్ నుంచి ది బెస్ట్ డెబ్యూ ఎవరిది అంటే డౌటే లేకుండా చెప్పే పేరు హృతిక్ రోషన్. ఆ సినిమానే కహో నా ప్యార్ హై. ఈ మూవీ విడుదలై ఈ నెల 14కు పాతికేళ్లు. అంటే 2020 జనవరి 14న విడుదలైందీ మూవీ. తన తండ్రి, దర్శక నిర్మాత రాకేష్ రోషన్ వారసుడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హృతిక్ రోషన్. ఇతని డెబ్యూ మూవీని డైరెక్ట్ చేసింది కూడా తండ్రే కావడం విశేషం. ఇక ఫస్ట్ మూవీలోనే డ్యూయొల్ రోల్ చేసి అదరగొట్టాడు. ఈ సినిమా సాధించిన విజయం చూసి ఇక ఖాన్స్ ఎరా ఖతమ్ అయింది.. హృతిక్ రోషన్ అనే కొత్త కుర్రాడు బాలీవుడ్ ను రూల్ చేయబోతున్నాడు అని రాశాయి అన్ని పత్రికలు. ఆ రేంజ్ విజయం అది. ఆ రోజుల్లో 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కహో నా ప్యార్ హై ఏకంగా 80 కోట్ల వసూళ్లు సాధించి వాహ్ అనిపించింది.

అంతేకాదు.. ఒకే సినిమాతో బెస్ట్ యాక్టర్ గా, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా అవార్డ్ అందుకున్న ఏకైక బాలీవుడ్ హీరోగా హృతిక్ రోషన్ రికార్డ్ సాధించాడు. దీంతో పాటు అత్యధిక అవార్డ్స్ అందుకున్న సినిమాగా కహో నా ప్యార్ హై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం విశేషం.

మిల్లీనియం బ్లాక్ బస్టర్ గా సినిమాను మిల్లీనియం సూపర్ స్టార్ గా హృతిక్ రోషన్ ను పొగిడేశాయి పత్రికలన్నీ. ఇదే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయింది అమీషా పటేల్. ఆ మూవీకి వచ్చిన క్రేజ్ చూసే తనను తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బద్రి మూవీలో తీసుకున్నాడు పూరీ జగన్నాథ్. తర్వాత తను కూడా కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఎలా చూసినా కహో నా ప్యార్ హై తో హృతిక్ రోషన్ కు దక్కిన ది బెస్ట్ డెబ్యూ ఇప్పటి వరకూ మరే హీరోకూ దక్కలేదు అనేది వాస్తవం. అందుకే ఈ 25 ఇయర్స్ అకేషన్ ను పురస్కరించుకుని మళ్లీ అదే డేట్ న చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

విశేషం ఏంటంటే.. ఈ మూవీని 1986లో వచ్చిన కన్నడ మూవీ ‘రథ సప్తమి’ నుంచి ఇన్స్ స్పైర్ అయి రూపొందించాడు దర్శకుడు రాకేష్ రోషన్.

Tags

Next Story