Krishnam Raju : కృష్ణంరాజు భౌతికకాయానికి ప్రముఖుల నివాళి..

Krishnam Raju : సినీ, రాజకీయ ప్రముఖులు రెబల్‌స్టార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆయన కృష్ణంరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణం రాజు మృతి సినీ, రాజకీయ రంగాలకు తీరనిలోటన్నారు కిషన్ రెడ్డి.
మెగాస్టార్ చిరంజీవి రెబల్‌స్టార్ పార్థివదేహానికి నివాళులర్పించారు. చిలకగోరింకలు సినిమా తర్వాత తొలిసారి కృష్ణంరాజును చూసినప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు. మన ఊరి పాండవులు సినిమా టైంలో తనను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు గారి అస్తమయం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్‌బాబు, వెంకటేష్, రాఘవేంద్రరావు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, జూనియర్ ఎన్టీఆర్....కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
రేపు మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com