Actress Meena: మీనా ఇంట తారల సందడి.. ఫ్రెండ్‌షిప్ డే రోజు..

Actress Meena: మీనా ఇంట తారల సందడి.. ఫ్రెండ్‌షిప్ డే రోజు..
X
Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో చికిత్సపొందుతూ మృతి చెందిన భర్త మరణాన్ని జీర్ణించుకుని మళ్లీ యధావిధిగా తాను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది నటి మీనా.

Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో చికిత్సపొందుతూ మృతి చెందిన భర్త మరణాన్ని జీర్ణించుకుని మళ్లీ యధావిధిగా తాను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది నటి మీనా. ఇప్పుడు మొదటిసారిగా తన స్నేహితులు, తనతోటి నటులు ఆమెను పలకరించేందుకు మీనా ఇంటికి వెళ్లారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగారు.. మీనా ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట సందడి చేస్తున్నాయి.

నటి మీనా బాలతారగా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత నటిగా మారి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలు అందరికీ పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన అంబుదాన్ చిత్రంలో బాలనటిగా నటించింది. హీరోయిన్‌గా ఆయనతో ముత్తు అనే చిత్రంలో యాక్ట్ చేసింది.

నటిగా కొనసాగుతూనే 2009లో విద్యాసాగర్‌ని వివాహం చేసుకుంది మీనా. సాగర్ మీనాలకు నైనిక అనే కూతురు పుట్టింది. తల్లి మీనాలాగే నైనిక కూడా విజయ్ నటించిన తేరి చిత్రంలో బాలతారగా ఎంట్రీ ఇచ్చింది. భార్యగా, తల్లిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించిన మీనా తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విభిన్న పాత్రలు పోషించింది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో విషాదం నెలకొంది.. భర్త విద్యాసాగర్ మృతితో ఆమె జీవితంలో విషాదం నెలకొంది.

విద్యా సాగర్ మరణించిన ఒక నెల తర్వాత , మీనా ఆమె కుమార్తె నైనిక నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆమె సన్నిహితులు మరియు ప్రముఖ నటీమణులు సంఘవి, సంగీత, రంభలు కలుసుకున్నారు. నటీమణులు కుటుంబ సమేతంగా వచ్చి మీనాను కలిసి ఫొటోలు దిగారు. తన భర్త మరణానంతరం తొలిసారిగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోను చూసిన అభిమానులు నటి మీనా పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే ఆమె ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్‌లో రాజేంద్రప్రసాద్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేయగా ఆ వేడుకల్లో మీనా కనిపించడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది.

Next Story