Gandeevadhari Arjuna : వరుణ్ తేజ్ కొత్త సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు ఏమన్నారంటే..

Gandeevadhari Arjuna : వరుణ్ తేజ్ కొత్త సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు ఏమన్నారంటే..
X
‘గాండీవధారి అర్జున’ కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న సినిమా ‘గాండీవధారి అర్జున’కు సంబంధించి లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. హీరోయిన్ సాక్షి వైద్య ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. ప్రవీణ్ సత్తార్ ద‌ర్శ‌కత్వం వహిస్తోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాజర్‌, విమలారామన్‌, వినయ్‌ రాయ్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా.. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, పాటలు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) స‌ర్టిఫికేట్ ఇచ్చింది. బోర్డు సభ్యులు ఈ మూవీపై పాజిటివ్‌గానే రెస్సాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ సీన్స్ అదిరిపోయాయ‌ని, ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయ‌ని సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల అల‌రిస్తుంద‌ని సెన్సార్ బోర్డు స‌భ్యులు చెప్పిన‌ట్లు సమాచారం.

వరుణ్ తేజ్ 12వ సినిమాగా రాబోతున్న 'గాంఢీవధారి అర్జున'.. యధార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే ఆయన 13వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story