Kangana Ranaut : కంగనా రనౌత్ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

వివాదాస్పద నటి, ఎమ్.పి కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో ఉంటోందీ మధ్య. కొన్నాళ్లుగా ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. అయినా తనే నెంబర్ వన్ అనే ఫీలింగ్ తో ఉంటుంది కంగన. పైగా ఇతర హీరోలను ముఖ్యంగా నెపో స్టార్స్ ను విమర్శించడంలో ఎప్పుడూ ముందే ఉంటోంది. ఇక ఎమ్.పి గెలిచిన ఆనందం ముగియక ముందే ఎయిర్ పోర్ట్ లో ఓ ఉద్యోగి చేతిలో చెంప దెబ్బలు తిని అభాసుపాలైంది. అయినా బిజెపి నాయకత్వాన్ని వెనకేసుకు వస్తూ.. అందరినీ మూర్ఖులు అనే అంటుంది. ఆ మధ్య రాహుల్ గాంధీని డ్రగ్ అడిక్ట్ అని తీవ్ర విమర్శలు చేసింది. ప్రస్తుతం కొందరు ఆమెను హిస్టారికల్ ఫూల్ అంటున్నారు. అంటే చరిత్రకు సంబంధించిన అవగాహన లేకున్నా.. తనకు తెలిసిందే చరిత్ర అని చెబుతూ వస్తోందట. ఆ కారణంగానే ఈ ట్యాగ్ వేశారు. అయితే బిజెపి ఈమెను మాట్లాడొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ఇక నెహ్రూ వల్లే ఈ దేశం వెనకబడిందని బలంగా నమ్మే కంగనా రనౌత్.. ఆ మధ్య ఎమర్జెన్సీ అనే సినిమా రూపొందించింది. దీనికి తనే నిర్మాత, దర్శకురాలు, మెయిన్ లీడ్ కూడా. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించబోతోంది. లుక్ కు సంబంధించి అదిరిపోయిందనే చెప్పాలి. మరి కంగనా ఎమర్జెన్సీ పేరుతో ఇందిరా గాంధీ పాత్ర చేస్తూ సినిమా రూపొందించిందంటే అందులో ఎలాంటి సత్యాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. అయితే కొన్ని రోజులుగా ఈ మూవీ సెన్సార్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. బట్ అది నిజం కాదు అని కంగనానే స్వయంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. తన సినిమా ఇంకా సెన్సార్ కాలేదనీ.. కావాలనే కొందరు ఆపుతున్నారు అంటూ ఎప్పట్లానే ఆరోపణలు చేస్తోంది. అయినా ఇప్పుడు అధికారంలో ఉంది బిజెపినే కదా. అలాంటిది ఆమె సినిమాకు సెన్సార్ షిప్ ఆగుతుందా. అంటూ కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సెన్సార్ నుంచి సర్టిఫికెట్ వచ్చినా.. చాలా కట్స్ ఉంటాయని ఊహించొచ్చు. అయితే బిజెపి పూర్తి మెజారిటీతో గెలిచి ఉంటే ఈ సినిమా యధాతథంగా విడుదలై ఉండేదే. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి మెజారిటీ లేదు. చాలా చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఇవి డ్యామేజ్ చేస్తాయనే కంగనా సినిమాకు సెన్సార్ ఆపినట్టు భావిస్తున్నారు.
మరోవైపు ఒకవేళ సెన్సార్ అయి సినిమా విడుదలైనా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ మూవీని విడుదల కానివ్వం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదీ మేటర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com