Naga Chaitanya : చైతన్య, శోభిత కూడా విడిపోతారు - వేణు స్వామి

శుభం పలకరా వేణన్నా అంటే నాగ చైతన్య - శోభిత విడిపోతారు అన్నాట్ట. అట్టా ఉంది మన గ్రేట్ ఆస్ట్రాలజర్.. చెప్పినవేవీ జరగని లెక్కల మాస్టర్ వేణు స్వామి వ్యవహారం. సమంతో విడాకులు తర్వాత నాగ చైతన్య మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. తాజాగా శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే వేణు స్వామి వారి జాతకం చెప్పేశాడు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే 2027లో విడిపోతారు అంటూ ఏవో అంకెలు వేస్తూ వీడియో చేస్తూ మరీ చెప్పాడు. ఊళ్లో పెళ్లికి అదేదో హడావిడీ అన్నట్టుగా ఇప్పుడు వేణును ఎవరు అడిగారు వారి జాతకం చెప్పమని.. ఏదో అటెన్షన్ కోసం కాకపోతే అంటూ సోషల్ మీడియాలో మనోడి ఓ రేంజ్ ట్రోలింగ్ జరుగుతోంది.
అసలే ఈ మధ్య వేణు స్వామి ‘జాతకాలే’ బాలేదు. వరల్డ్ కప్ వస్తుందన్నాడు. రాలేదు. వైసీపీ గెలుస్తుందన్నాడు. గెలవలేదు. ఇక్కడ బిఆర్ఎస్ దే విజయం అన్నాడు రాలేదు. ఇలా ఏం చెప్పినా దెబ్బైపోతున్నారు వేణు. దీంతో కొన్ని రోజులుగా కామ్ గా ఉంటున్నాడు. తీరా ఇప్పుడు మంచి అటెన్షన్ బేరం తగిలేసరికి నాగ చైతన్య, శోభితపై పడ్డాడు. ఒకవేళ వీళ్లు విడిపోయారే అనుకోండి.. అతనో గొప్ప జాతకాల రాయుడు అవుతాడా.. అదే నిజమైతే అతను చెప్పివన్నీ నిజం కావాలి కదా. ఏదేమైనా ప్రస్తుతం వేణు స్వామిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ ట్రోల్స్ వస్తున్నాయి.
విశేషం ఏంటంటే.. అన్నీ చెప్పి.. నా జాతకం నిజం కావడం కంటే ఆ ఇద్దరూ కలిసి ఉండటమే నాకు ఇంపార్టెంట్ అంటున్నాడు. అట్లుంటది వేణుతోని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com