Naga Chaitanya : చైతూ, శోభిత పెళ్లి డేట్ ఫిక్స్

Naga Chaitanya :  చైతూ, శోభిత పెళ్లి డేట్ ఫిక్స్
X

సమంతతో విడాకులు తర్వాత కొన్నాళ్లకే నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. బట్ అవేం నిజం కాలేదు కానీ.. చివరికి నిజమైంది కూడా మరో రూమరే. నటి శోభిత ధూళిపాలతో నాగ చైతన్య డేట్ చేస్తున్నాడు అంటూ ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. కొన్నిసార్లు ప్రూఫ్స్ తో సహా దొరికిపోయారు. బట్ ఎవరూ నిజం చెప్పలేదు. ఫైనల్ గా ఆ రూమరే నిజం చేస్తూ ఇద్దరూ ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేయడమే కాదు.. రెండు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. రీసెంట్ గా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ లో తనకు కాబోయే కోడలిని చిరంజీవికి కూడా పరిచయం చేశాడు నాగార్జున. ఆ ఫంక్షన్ లో శోభిత కూడా కుటుంబ సభ్యురాలిగానే ఉంది.

ఇక నిశ్చితార్థం తర్వాత పెళ్లే కదా.. ఆ డేట్ ఎప్పుడా అని చాలామంది అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఫైనల్లీ ఆ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. నాగ చైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న జరగబోతోంది. మరి ఇది కూడా డెస్టినేషన్ మ్యారేజా లేక.. సింపుల్ గా హైదరాబాద్ లోనే కానిచ్చేస్తారా అనేది చూడాలి. మొత్తంగా అటు సమంత మాత్రం తనకు ఇంక పెళ్లే వద్దు అనే చెబుతూ వస్తోంది. ఇటు చైతన్య మాత్రం ఎంచక్కా రెండో పెళ్లికి రెడీ అయిపోయాడు.

Tags

Next Story