Tollywood: కందికొండను ఇండస్ట్రీకి పరిచయం చేసిన చక్రీ

Tollywood: కందికొండను ఇండస్ట్రీకి పరిచయం చేసిన చక్రీ
Tollywood: ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'తెలుగు సినిమాలో సందర్భోచిత పాటలు' అనే అంశంపై పీహెచ్ డీ చేసి డాక్టరేట్ కూడా అందుకున్నారు.

Tollywood: తెలుగు సినిమా పాటల రచయిత కందికొండ యాదగిరిని మొదటి సారి ఇండస్ట్రీకి పరిచయం చేసింది దివంగత సంగీత దర్శకుడు చక్రి. అతను 2001 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చేరాడు. రెండు దశాబ్దాల పాటు సినిమాలకు మంచి మంచి పాటలు అందించాడు. తన ప్రారంభ రోజులలో అతడు ఎక్కువగా చక్రితో కలిసి పనిచేశాడు. తరువాత AR రెహమాన్, సందీప్ చౌతా, మణి శర్మ, యువన్ శంకర్ రాజా, రమణ గోగుల, అజయ్ – అతుల్, హారిస్ జయరాజ్, D. ఇమ్మాన్‌ల స్వరాలకు సాహిత్యం సమకూర్చాడు.. ప్రారంభంలో అతడు చక్రి స్వరపరిచిన అనేక ప్రైవేట్, ఆధ్యాత్మిక ఆల్బమ్‌లకు పనిచేశాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 'తెలుగు సినిమాలో సందర్భోచిత పాటలు' అనే అంశంపై పీహెచ్ డీ చేసి డాక్టరేట్ కూడా అందుకున్నారు. గీత రచయితగా నీది నాది ఒకే కథ, టెంపర్, లింగ, సుకుమారుడు, తుపాకి, పూల రంగడు, బబ్లూ, లక్ష్మీ పుత్రుడు, మస్కా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మొదలైన చిత్రాలకు పాటలు రాశారు.

తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హలో ప్రేమిస్తారా చిత్రం కోసం చివరి సారిగా పని చేశాడు. చివరి పాటలు.. నిన్న మొన్న, ఎన్నడు లేని, నీ పేరు వింటేనే, లైఫ్ అంటే ట్రావెల్, పోకిరి, దమ్ దమ్ దమ్ అనే పాటలు రాశారు . చక్రి మరణానికి కొన్ని నెలల ముందు 2014లో ఈ సినిమా విడుదలైంది.

Tags

Read MoreRead Less
Next Story