Chalona Song : నయన్ తో షారుఖ్ రొమాన్స్.. 'జవాన్' పై షారుఖ్ తెలుగు పోస్ట్

Chalona Song : నయన్ తో షారుఖ్ రొమాన్స్.. జవాన్ పై షారుఖ్ తెలుగు పోస్ట్
'ఛలోనా' అంటూ రొమాంటిక్ సాంగ్ లో క్యూట్ గా కనిపిస్తోన్న నయన్, షారుఖ్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న 'జవాన్' రోజుకో వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన జిందా బందా సాంగ్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షారుఖ్ స్టెప్పులు ఈ పాటకి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా రీసెంట్ గా సెకండ్ సింగిల్ ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపర్చారు. ‘ఛలోనా’ అంటూ సాగే ఈ సాంగ్ లో షారుఖ్ ఖాన్, నయనతార జోడీ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. మొదటిసారి ‘జవాన్’ కోసం జతకట్టిన వీరిద్దరూ ఆన్ స్క్రీన్‌పై చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ షేర్ చేసిన ఓ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ప్రేమ కొలవలేనిది , హద్దులు లేనిది అయ్యుండాలి .. అటువంటిదే జవాన్ ప్రేమ! ‘ఛలోనా’ పాట ఇప్పుడు రిలీజ్ అయ్యింది !’ అంటూ షారుఖ్ తెలుగులో చేసిన ట్వీట్.. తన తెలుగు ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా నిలిచింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటకు ఆదిత్య ఆర్‌కే, ప్రియా మాలి తమ స్వరాలను అందించారు. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా వెలిగిపోతున్న ఫరాహ్ ఖాన్ పాటను కంపోజ్ చేశారు. సెప్టెంబర్ 7న షారుఖ్ ‘జవాన్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నయనతారతో పాటు విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె లాంటి స్టార్ నటీనటులు ఇందులో ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చలామణీ అవుతున్న అనిరుధ్ రవిచందర్.. పలు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్యూన్స్‌ను అందిస్తూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే టీజర్‌లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్‌కు ప్రేక్షకులు ఫిదా కాగా.. బాలీవుడ్‌లో ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆ మ్యూజిక్‌తో తమ ఫేవరెట్ హీరోల ఎడిట్స్ చేసుకుంటూ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ఇక తాజాగా విడుదలయిన ‘ఛలోనా’ పాటతో కూడా అనిరుధ్ మెలోడీ లవర్స్‌ను ఆకట్టుకున్నాడు.

Tags

Next Story