Champion Trailer : భైరాన్ పల్లి యుద్ధంలో ఛాంపియన్ పోరాటం

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ఛాంపియన్. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తే సింపుల్ గా సూపర్బ్ అనిపించేలా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా హైదరాబాద్ స్వాతంత్ర్యం రాలేదు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినా రెండేళ్ల వరకు నిజాం ఆకృత్యాలు సాగించాయి. ఆ ఆకృత్యాల్లో కీలకంగా చెప్పుకున్నది భైరాన్ పల్లి పోరాటం. ఆనాటి తెలుగు వాళ్లంతా కమ్యూనిస్ట్ ల ఆధ్వర్యంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ఆ పోరాటం అత్యంత కీలకంగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ నేపథ్యంలో ఛాంపియన్ కథతో రూపొందించారు. మరి ఈ పోరాటం తర్వాత నిజాం రాజ్యం విడిచిపోయాడు అనేది అందరికీ తెలిసిందే అయినా ఈ కథలో ఉన్న మలుపులు, మెరుపులు ఎలాంటివి అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.
రోషన్ కటౌట్ అదిరిపోయింది. ఈ పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఫుట్ బాల్ ప్లేయర్ లా కనిపిస్తున్నాడీ మూవీలో. ముందుగా నిజాంపై పోరాటం కోసం అతనివంతుగా ఏం చేయకపోయినా తర్వాత అతనూ పోరాటంలో భాగం అవడం కనిపిస్తోంది. హీరోయిన్ గా అనస్వర రాజన్ కరెక్ట్ గా సూట్ అయ్యేలా కనిపిస్తోంది. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది అనిపించేలా ఉంది. 35యేళ్ల తర్వాత మొహానికి రంగేసుకున్న కళ్యాణ్ చక్రవర్తి పాత్ర కూడా కీలకంగా ఉండబోతోంది అనిపిస్తోంది. మొత్తంగా భైరాన్ పల్లిలో బందూకు పట్టిన పోరాట యోధుడుగా కనిపించబోతున్నాడు రోషన్. ఈ పోరాటంలో ఛాంపియన్ ఎంత కీలకం అవుతాడో అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.
కంటెంట్ పరంగా ఆకట్టుకునేలా ఉంది మూవీ. సెట్ వర్క్, ఆర్ట్ వర్క్, టెక్నికల్ గా బెస్ట్ అనిపించేలా ఉంది. ఆనాటి కాలాన్ని రీ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. రోషన్ కు మాత్రం ఇదో బెస్ట్ మూవీ కాబోతోంది అనిపించేలా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

