Champion Trailer : ఛాంపియన్ ట్రైలర్ వచ్చేస్తోంది..

ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన సినిమా ఛాంపియన్. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన మూవీ ఇది. అనస్వర రాజన్ హీరోయిన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే రెండు పాటలూ సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ముఖ్యంగా గిర గిర గిరే సాంగ్ మాత్రం ఇన్స్ స్టంట్ గా సూపర్ హిట్ గా నిలిచింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రియాంక స్వప్న దత్, జికే మోహన్, జెమిని కిరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25నే విడుదల కాబోతోందీ మూవీ. అదే రోజున చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ చిత్రం కూడా పోటీగా నిలుస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. ఆ టాక్ ను బలంగా మార్చడానికి ట్రైలర్ రాబోతోంది. ఈ గురువారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. మరి ట్రైలర్ ను ఎవరి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు అనేది ఇంకా చెప్పాల్సి ఉంది.
ఇక మూవీ పరంగా చూస్తే స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథలాగా కనిపిస్తోంది. ఆ మేరకు రోషన్ మేకోవర్ చాలా బావుంది అనే టాక్ వచ్చింది. అతనో ఫుట్ బాల్ ప్లేయర్ లానూ కనిపించబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు.మొత్తంగా ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీపై అంచనాలు ఏ స్థాయిలో పెరగబోతున్నాయో అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

