ChandraBose: నాటు.. నాటు.. నా మనసులోని భావాలకు అక్షర రూపం: చంద్రబోస్
Chandra Bose: ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు చోటు దక్కడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ పాట రాసిన చంద్రబోస్ పాటల రచయితగా తనకు మరింత బాధ్యతను పెంచింది, ఉత్సాహాన్ని ఇచ్చింది అని ఆనందంతో చెప్పారు.నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాటకు సంగీతం సమకూర్చిన కీరవాణికి, దర్శకుడు రాజమౌళికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పల్లెటూరి నుంచి వచ్చిన ఓ సామాన్య వ్యక్తికి ఇంతటి గౌరవం దక్కడం నిజంగా నా అదృష్టం అని పేర్కొన్నారు. ఇక ఈపాట రాయడానికి చాలా సమయం పట్టిందని, పాటలో రాసిన ప్రతి పదం.. నాబాల్యం, నా ఊరు, నా కుటుంబానికి సంబంధించినది.. నా మనసులోని భావాలకు అక్షరరూపం ఈ పాట అని అన్నారు.ఆస్కార్ నామినేషన్ల గురించి మాట్లాడుతూ.. ఇది నాకు నమ్మశక్యం కానిది, ఎంతో అపురూపమైనది. జాబితాలో మొత్తం 15 పాటలున్నాయి. అందులో నాటు పాట ఒకటి. అవతార్ సినిమాలోని పాటలకు, ఆర్ఆర్ఆర్ పాటకు మధ్య పోటీ ఉంటుందని నేను అనుకున్నాను.. కానీ అన్నింటినీ దాటి ఈ పాట టాప్5లో నిలవడం నిజంగా ఊహించలేదు అని చెప్పారు. ఇక ఆస్కార్ రిజల్ట్ ఏమై ఉంటుందో తెలియాలంటేమార్చి 13 వరకు ఆగాల్సిందే మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com