Nandamuri Balakrishna : బాలయ్య వేడుకకు చంద్రబాబుకు ఆహ్వానం

నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, నిర్మాత కె. ఎల్. నారాయణ గారు, నిర్మాత జెమినీ కిరణ్ గారు, నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, అలంకార్ ప్రసాద్ గారు, రాజా యాదవ్ గారు...నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇండస్ట్రీ సమస్యలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com