Pushpa : దాక్కో దాక్కో మేక 29 రోజులు!

అల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సీక్వెల్ "పుష్ప 2: ది రూల్" చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియోటర్లలోకి రానుంది. అందుకు మరో 100 రోజుల సమయముంది. పుష్ప సినిమా హిట్ కావడంతో పుష్ప 2 ది రూల్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ఓ పాటరే సేందుకు 29 రోజుల సమయం పట్టిందని రచయిత చంద్రబోస్ తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరీర్ లో ఒక పాట రాసేందుకు ఎక్కువ సమయం తీసుకున్న అదేనని తెలిపారు. ఆ పాటే దాక్కో దాక్కో మేక..! అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరెక్కించిన ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మికా మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. తొలుత ఈ మూవీ ఆగష్టు 15న థియోటర్లలోకి రానుందని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో వాయిదా వేశారు. అప్పటినుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన అప్డేట్లను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. ఇటీవలే సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వంద రోజుల సమయం ఉందని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. భారీ అంచనాలతో వస్తున్న పుష్ప -2ను ప్రేక్షకులు ఏ లెవల్ లో ఆదరిస్తారో చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com