Chandramukhi 2: అదిరిన ఫస్ట్ లుక్... 'చంద్రముఖి'గా కంగనా

Chandramukhi 2: అదిరిన ఫస్ట్ లుక్... చంద్రముఖిగా కంగనా
'చంద్రముఖి' పాత్రలో అద్భుతమైన రూపంలో కంగనా..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోన్న చిత్రాలలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం 'చంద్రముఖి 2'. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, కంగనా రనౌత్ అద్భుతమైన మెటల్ పొదిగిన పచ్చ చీరతో భారీ ఆభరణాలలో కనిపించింది. చంద్రముఖిగా, ఒక రాజభవనంలో బలంగా నిలబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె హెయిర్‌ స్టైల్, మేకప్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆమె రూపాన్ని పంచుకుంటూ, లైకా ప్రొడక్షన్స్ ఇలా రాసుకువచ్చింది. "అప్రయత్నంగానే మన దృష్టిని దోచుకునే అందం & భంగిమ. చంద్రముఖి2 నుండి చంద్రముఖిగా కంగనా రనౌత్ కమాండింగ్ & బ్రహ్మాండమైన మొదటి రూపాన్ని ప్రదర్శిస్తోంది" అంటూ ట్వీట్ లో పేర్కొంది. కాగా పి వాసు దర్శకత్వం వహించిన ఈ కామెడీ హారర్ మూవీ సెప్టెంబర్ 19న వెండితెరపైకి రానుంది.

కంగనా ఫోజు, ఫస్ట్ లుక్ పోస్టర్ పై అభిమానులు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో ఆమె రూపం చాలా అద్భుతంగా ఉందని, చంద్రముఖిగా రనౌత్ ఖచ్చితంగా ఆమె అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోందని అంటున్నారు. మా రాణిని పెద్ద స్క్రీన్‌పై చూడటానికి వేచి ఉండలేమని చెబుతున్నారు. ఆమెను ఇప్పటికే షో స్టీలర్ అని పిలుస్తుండగా.. తాజాగా రివీలైన ఫస్ట్ లుక్ తో కంగనా మరోసారి ప్రేక్షకులకు మాంచి ట్రీట్ ఇచ్చారు. ఇక 'చంద్రముఖి 2'లో వడివేలు, సృష్టి డాంగే, లక్ష్మీ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

గతంలో 'వెట్టయన్ రాజా'గా రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్‌ని లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో లారెన్స్ ఒక ప్యాలెస్ మెట్ల మీదుగా నడుస్తున్నట్టు భయంకరమైన ఫోజులో కనిపించాడు. అయితే, అతని లుక్ కు అభిమానులను నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఒక వర్గం అభిమానులు అతని లుక్ పై పలు కామెంట్లు చేయగా, మరికొందరు ఆ పాత్ర కోసం రజనీకాంత్‌ను తీసుకోనందుకు మేకర్స్‌ను నిందించారు.

'చంద్రముఖి 2'లో కంగనా రనౌత్.. రాజభవనంలో నర్తకిగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె రాఘవ్ లారెన్స్ తో జతకట్టనుంది. అసలు 'చంద్రముఖి'లో రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు పార్ట్ 2 లో కంగనా కథానాయికగా నటించడం పట్ల ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈసారి కంగనా రనౌత్ ఆ పాత్రను తన సొంతం చేసుకునేందుకు ఏ మాత్రం తీసిపోలేదని చెప్పవచ్చు. ఇక కంగనా ప్రస్తుతం 'చంద్రముఖి 2'తో పాటు, 'ది ఎమర్జెన్సీ' పేరుతో వస్తోన్న మూవీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే అభిమానులను బాగానే ఆకట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story