Chandramukhi 2: చంద్రముఖిగా కంగనా రనౌత్... పోస్టర్ రిలీజ్

Chandramukhi 2:  చంద్రముఖిగా కంగనా రనౌత్... పోస్టర్ రిలీజ్
X
చంద్రముఖి తలుపు నుంచి ఓ కాంతి వెలువడగా లారెన్స్ చూస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది

చంద్రముఖి 2 పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. రాఘవ లారెన్స్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ సినిమా రాబోయే వినాయక చవితికి రిలీజ్ కానున్నట్లు తెలిపింది. ఇందుకుగాను సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందులో చంద్రముఖి తలుపు నుంచి ఓ కాంతి వెలువడగా లారెన్స్ చూస్తున్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. షూటింగ్ పనులను ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.




2006 లో రిలీజై భారీ విజయాన్ని సాధించిన చంద్రముఖి సినిమాకు ఇది సీక్వెల్ అని తెలిపారు కంగన. గత సంవత్సరం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుని ఈ ఏడాది విడుదలకు రెడీ అవుతోంది. ఇందుకుగాను పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో లారెన్స్ ప్రొఫేసర్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రముఖి పాత్రలో కంగన అలరించనుంది.






షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన కంగనా.. తన సోషల్ మీడియా ఎకౌంట్ లో లారెన్స్ ను పొగడ్తలతో ముంచెత్తింది.తన చివరి షెడ్యూల్ ను ముగించుకున్న తర్వాత మాట్లాడిన ఆవిడ.. మంచి మనుషులకు సెండాఫ్ ఇవ్వడానికి కష్టంగా ఉంటుందని తెలిపింది. లారెన్స్ సర్ చాలా గ్రౌండెడ్ పర్సన్. డ్యాన్స్ మాస్టర్ నుంచి మొదలైన ఆయన కెరీర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతుందని చెప్పింది. ప్రజలకు మంచి చేసే ఆయనకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంది. చంద్రముఖి 2 లో కంగన ఆస్తాన నర్తకి పాత్రను పోషించింది. తదుపరి చిత్రం ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తోంది.


Tags

Next Story