చంద్రముఖిగా కనిపించనున్న అరుంధతి..

చంద్రముఖిగా కనిపించనున్న అరుంధతి..
ఏ భాషలో అయినా హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ప్రేక్షకులు వారిని భయపెట్టే సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు.

ఏ భాషలో అయినా హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ప్రేక్షకులు వారిని భయపెట్టే సినిమాలనే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే హారర్, థ్రిల్లర్ జోనర్లు ఎప్పుడూ మినిమమ్ గ్యారెంటీ హిట్లనే అందిస్తాయి. ఒకప్పుడు ఇలాంటి సినిమాలు కూడా ఇతర వాటిలాగానే విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు హారర్ మూవీస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడడంతో మేకర్స్ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

అలా ఒకప్పటి టైమ్‌లో హారర్ సినిమాలకు సౌత్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది చంద్రముఖి. అప్పట్లోనే ఈ సినిమా 2 కోట్లకు పైగా లాభాలను సాధించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి ముఖ్య కారణం హీరో రజినీకాంత్ అయినా.. విడుదల తర్వాత మాత్రం ఇందులోని హారర్ ఎలిమెంట్సే అందరినీ థియేటర్లకు రప్పించగలిగాయి.

అలాంటి ల్యాండ్‌మార్క్‌ సినిమాకు 16 సంవత్సరాల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం తమిళ ఇంండస్ట్రీలో హారర్ పేరు చెప్పగానే గుర్తొస్తున్న నటుడు రాఘవ లారెన్స్. ఈ హీరో తాను డైరెక్ట్ చేస్తున్న చిత్రాలతో పాటు ఇతర దర్శకులతో కూడా ఎక్కువగా హారర్ సినిమాలను చేయడానికే ఇష్టపడుతున్నాడు. అందుకే చంద్రముఖి దర్శకుడు పి వాసు లారెన్స్‌ను ఈ సీక్వెల్‌కు హీరోగా ఎంపిక చేసాడని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా చంద్రముఖిలో తన కామెడీతో అందరినీ అలరించిన సీనియర్ కమెడియన్ వడివేలు సీక్వెల్ లో కూడా ప్రేక్షకులను గిలిగింత పెట్టే పాత్రలో కనిపించనున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా చంద్రముఖి 2 గురించి ఒక వార్త వైరల్ గా మారింది. అదే ఇందులో హీరోయిన్ గా అనుష్క నటిస్తుందనే విషయం. ఇది ఎంతవరకు నిజమో తెలియకపోయిన చంద్రముఖి 2కు అక్టోబర్ 15న శ్రీకారం చుట్టాలని దర్శకుడు వాసు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story