Meka Ramakrishna: జయసుధకే కాఫీలో మోషన్ ట్యాబ్లెట్లను కలిపేసిన నీచులు: టాలీవుడ్ ఆర్టిస్ట్

Meka Ramakrishna (tv5news.in)
Meka Ramakrishna: సినీ ప్రపంచం బయటికి కనిపించినట్టుగా రంగురంగుల కలలతో మాత్రమే నిండి ఉండదు. బయటికి కనిపించని ఎన్నో చేదు నిజాలు కూడా ఉంటాయి. వాటి గురించి తెలియాలంటే పెద్ద పెద్ద స్టార్లను కాదు.. చిన్న చిన్న ఆర్టిస్టులను కనుక్కోవాలి. అలా సినీ రంగంలో ఉండే కొన్ని చీకటి కోణాలను, చిన్న ఆర్టిస్టులకు జరిగే అవమానాలను బయటపెట్టారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మేకా రామకృష్ణ.
సినిమాల్లో పనిచేసే వారికి ఫుడ్ పెట్టేదగ్గర కేటగిరీలు ఉంటాయన్న విషయాన్ని బయటపెట్టారు మేకా రామకృష్ణ. సినిమా నిర్మాతలు ఫుడ్ పెట్టే విధానాన్ని నాలుగు కేటగిరీలుగా విభజిస్తారట. అందులో హీరోలు, నిర్మాతలకు ఒక కేటగిరి. టెక్నిషియన్లకు, డైరెక్టర్లకు ఒక కేటగిరి. జూనియర్ ఆర్టిస్టులకు ఒక కేటగిరి. సెకండ్ గ్రేడ్ టెక్నీషియన్లకు ఇంకో కేటగిరిగా డివైడ్ చేస్తారట. పొరపాటున ఒక కేటగిరిలో తినాల్సిన వారు మరో కేటగిరిలో తింటే వారిని చాలా నీచంగా చూస్తారని చెప్పుకొచ్చారు మేకా రామకృష్ణ.
ముఖ్యంగా ప్రొడక్షన్ బాయ్స్.. సపోర్టింగ్ ఆర్టిస్టులను నీచాతినీచంగా ట్రీట్ చేస్తారట. చాలామంది ఆర్టిస్టులు వారి ప్రవర్తన వల్ల కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారని బయటపెట్టారు మేకా రామకృష్ణ. ఈ విషయాలు దర్శక, నిర్మాతల వరకు వెళ్లవని అన్నారు. ఒకవేళ ప్రొడక్షన్ బాయ్స్ వ్యవహారానికి ఎవరైనా ఎదురుతిరిగితే కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపి ఇస్తారట. జయసుధకు కూడా ఒకసారి అలాగే చేశారని స్పష్టం చేశారు రామకృష్ణ.
ఇవి మాత్రమే కాకుండా ఒకసారి ఆయన పర్సనల్‌గా ఎదుర్కున్న ఓ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు మేకా రామకృష్ణ. ఒకసారి ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు మిగతా వారికి వేడివేడిగా వడ్డించి, ఆయనకు మాత్రం బయట నుండి తెచ్చిన అన్నం పెట్టారట. తనకు కూడా అదే పెట్టమని అడగగా, ఆయనకు అంత రేంజ్ లేదని అందరి ముందు అవమానించారట. ఆ అవమానం తట్టుకోలేక చనిపోవాలనుకున్నారట మేకా రామకృష్ణ.
షూటింగ్ లొకేషన్లలో రూమ్ ఇవ్వకపోవడం, మేల్ ఆర్టిస్టులకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం లాంటి ఎన్నో సమస్యల గురించి మేకా రామకృష్ణ బయటపెట్టారు. ఒకవేళ ఈ అవమానాలు భరించలేక ఎవరైనా ఎదురుతిరిగితే.. వారికి అవకాశాలు ఇవ్వరని ఆయన అన్నారు. గ్లామర్ ప్రపంచం అంటే మనం చూసేది మాత్రమే కాదని.. లోపల ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మేకా రామకృష్ణ మాటల్లో మరోసారి స్పష్టమయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com