Ganesh Acharya: ఊ.. అంటావా మావ కొరియోగ్రాఫర్ పై చార్జిషీట్ దాఖలు..

Ganesh Acharya: బాలీవుడ్ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. లైంగిక వేధింపుల విషయమై అతడితో పాటు అతని అసిస్టెంట్ పై కూడా 354-ఎ, 354-సి, 354-డి,509,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. 2020లో మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆయనకు అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. గణేష్ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, తనకు అడల్ట్ మూవీని చూపించి తనను వేధించాడని ఆమె ఆరోపించింది. అతడి కోర్కెలను తిరస్కరించడంతో అతని సహాయకులు కూడా తనపై దాడి చేశారని ఆమె పేర్కొంది.
పరిశ్రమలో రాణించాలంటే తాను చెప్పినట్లు నడుచుకోవాలని అన్నాడు. నిరాకరించినందుకుగాను ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి తన సభ్యత్వాన్ని రద్దు చేయించాడని తెలిపింది.
గతంలో, కొంతమంది సహోద్యోగులచే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గణేష్ ఆచార్య తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా అభివర్ణించారు.
గణేష్ తరపు న్యాయవాది రవి సూర్యవంశీ మాట్లాడుతూ తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, ముంబై పోలీసులు కూడా ఛార్జిషీట్ గురించి తమకు తెలియజేయలేదని చెప్పారు.
కాగా, గణేష్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా పాటకు కొరియోగ్రఫీ చేశారు. సమంత కూడా పాటకు తగ్గట్టు అభినయించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ పాటతో సమంత కెరీర్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com