Puri Jagannadh : పూరీ, ఛార్మీ కలిసే ఉన్నారా.?

ఒకప్పటి డాషింగ్ డైరెక్టర పూరీ జగన్నాధ్ కొన్నాళ్లుగా బాగా వెనకబడిపోయి ఉన్నాడు. వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన బూస్ట్ ను లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పోగొట్టుకున్నాడు. ముఖ్యంగా అతని కథల్లో అస్సలే మాత్రం కొత్తదనం కనిపించడం లేదు. కథనంలోనూ అదే రొడ్డకొట్టుడు ఫార్ములాతో వస్తున్నాడు. ఈ కారణంగా సినిమాలు పోతున్నాయి. అయితే అనూహ్యంగా అతను సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా ఉన్న విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. పైగా ఇది ప్యాన్ ఇండియా సినిమాట. విజయ్ కి ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ వచ్చిందిప్పుడు. ఎలాంటి పాత్రైనా చేయగల నటుడు అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి పూరీతో సినిమా అతనికి కొత్త కిక్ ఇస్తుందనే చెప్పాలి. పూరీ మనసు పెట్టి రాయాలే గానీ.. ఆ పాత్రలకే వన్నెతెస్తాడు. ఇక విజయ్ సేతుపతి లాంటి నటుడు తోడైతే చెలరేగిపోతాడేమో. అయితే ఈ మూవీ ఇన్ఫర్మేషన్ సందర్భంగా కన్ఫర్మేషన్ అంటూ వదిలిన ఒక ఫోటో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
పూరీ ఇలా ఫ్లాపుల్లో పడిపోవడానికి అతనితో ‘నిర్మాణ భాగస్వామి’గా చేరిన ఛార్మీయే ప్రధాన కారణం అనే కామెంట్స్ ఉన్నాయి. కొందరు బాహాటంగానే చెప్పారు. మరికొందరు అంతా తమకు తెలుసు అయినా మాట్లాడం అన్నట్టుగా ఉంటున్నారు. ఓ దశలో ఫ్యామిలీ కూడా డిస్ట్రబ్ అయింది. ఈ విషయమూ బండ్ల గణేష్ లాంటి నటులు వేదికలపైనే మాట్లాడారు. ఇక డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు అనే వార్తలు బాగా చక్కర్లు కొట్టాయి. లైగర్ తర్వాత ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడ్డారు అనేది వాస్తవం. అనేక సమస్యలు దాటి డబుల్ ఇస్మార్ట్ చేస్తే అదీ పోయింది. అందుకే విడిపోయారు అన్నారు. బట్ విజయ్ సేతుపతితో మూవీ సందర్భంగా ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. అంటే రిజల్ట్ కూడా సేమ్ ఉంటుందా లేక మారుతుందా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com