Chatrapathi Sekhar : 'నేనెప్పుడూ కూడా రాజమౌళిని అవకాశాలు అడగలేదు' : ఛత్రపతి శేఖర్

Chatrapathi Sekhar : ఛత్రపతి శేఖర్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు బహుశా ఉండడేమో.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే అన్ని సినిమాల్లో ఎదో ఓ రోల్ పోషిస్తుంటాడు ఇతను.. ఇటీవల రిలీజై అదరగొడుతున్న RRR మూవీలో కీ రోల్ ప్లే చేశాడు శేఖర్ .. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్... రాజమౌళి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
రాజమౌళి సీరియల్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే పరిచయం ఉందని, తానెప్పుడు రాజమౌళిని అవకాశాలు అడగనని, సపోర్ట్ చేయాలి అన్న ఓకే ఒక్క ఉద్దేశంతో రాజమౌళి తనకి సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. రాజమౌళి సినిమా మొదలు పెట్టాక తనని పిలుస్తాడని.. అప్పటివరకు తనకి సినిమాలో తాను పోషించే పాత్ర ఏంటో కూడా తెలియదని పేర్కొన్నాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే తనకి చాలా ఇష్టమని, ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదని, కలిస్తే ఆయన పాదాలకు నమస్కారం చేయాలని ఉందని తెలిపాడు. చరణ్‌ని కలిసినప్పటికీ ఈ విషయాన్ని చెప్పలేదని అన్నాడు. కాగా RRR మూవీలో జంగు అనే పాత్రలో నటించి మెప్పించాడు శేఖర్.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com