Rajkundra : చిక్కుల్లో శిల్పా శెట్టి భర్త.. చీటింగ్ కేసు నమోదు..!

Rajkundra : బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా మరో చిక్కులో చిక్కుకున్నారు. రాజ్‌కుంద్రాతో పాటుగా మరికొందరి పైన శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. నితిన్ బరాయ్ అనే ఓ బిజినెస్‌మెన్ ఈ ఫిర్యాదు చేశారు. జులై 2014లో ఎస్‌ఎఫ్‌ఎల్ ఫిట్‌నెస్ కంపెనీ డైరెక్టర్ కాషీఫ్ ఖాన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతరులతో కలిసి లాభం పొందడానికి ఈ ఎంటర్‌ప్రైజ్‌లో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగినట్లు నితిన్ ఆరోపించారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల‍్చలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తర్వాత తిరిగి తన డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నట్లుగా తన ఫిర్యాదులో తెలిపాడు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో రాజ్‌కుంద్రా దంపతులపై సెక్షన‍్లు 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద‍్దేశ్యం)తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపైన పోలీసులు ఎంక్వయిరీ స్టార్ట్ చేశారు. కాగా పోర్నోగ్రఫీ చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రాకు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com