Surtyapet Junction : 'చెంగు చెంగు' అంటూ నయన సర్వర్ ను టీజ్ చేసిన ఈశ్వర్
ఈశ్వర్, నయన సర్వర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెన్సార్‌కు రెడీ అవుతున్నట్టు ఇటీవలే మేకర్స్ చెప్పారు. ఈ మూవీలో ఆర్ఎక్స్ ఫేమ్ పూజా ఐటెమ్ సాంగ్ లో కనిపించనుండడం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్ రిలీజ్ అయింది. ఈ వీడియో సాంగ్ ను సౌత్ ఇండియ స్టార్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
“చెంగు చెంగు అంటూ సాగే ఈ పాటను సాయిచరణ్ పాడాడు. హీరో ఈశ్వర్, హీరోయిన్ నయన సర్వర్ కూడా ఈ పాటకు డాన్స్ బాగా చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా స్టోరీ ఎంచుకుని ఈ సాంగ్ ను చాలా అందంగా చిత్రీకరించారు. రోషన్ సాలూరి మ్యూజిక్ కూడా బాగుంది. మా ఈశ్వర్ కి ఈ చిత్రంతో మంచి హిట్ రావాలి అని కోరుకుంటున్నానని ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సి. కళ్యాణ్ ఆకాంక్షించారు.
యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రయేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది. కాగా ఈ రోజు మూడో సాంగ్ రిలీజ్ సందర్భంగా హీరో ఈశ్వర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. 'సూర్యాపేట్ జంక్షన్' లోని మూడో పాటని సి. కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. బిజీ టైమ్ లోనూ ఆయన్ను అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేయడానికి ఒప్పుకుని మూవీ కంటెంట్ చూసి సూర్యాపేట్ జంక్షన్ మంచి సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారన్నారు. "మూడవ సాంగ్ విడుదల చేసినందుకు మూవీ టీమ్ తరపున, నా తరపున కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని" చెప్పారు.
ఇప్పటికే ఈ మూవీ టీజర్, ఐటమ్ సాంగ్ విడుదల కావడం, వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం జరిగిందని డైరెక్టర్ రాజేష్ నాదెండ్ల చెప్పారు. ఈశ్వర్ హీరోయిన్ని టీజింగ్ చేసే ఈ మాస్ సాంగ్ అందరికీ నచ్చుతుందన్నారు. వ్యవస్తను సరిదిద్దే బాధ్యత యువతపై ఉంటుందన్న రచయిత రాజేంద్ర భరద్వాజ్ ..... , కొత్తతరం ఓటర్లు తప్పకుండా చూడవలిసిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’ అని అన్నారు. కాగా ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, మిగిలిన అప్డేట్స్ త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com