Chennai Love Story : తొలిప్రేమ అంత తోపేం కాదు

Chennai Love Story :  తొలిప్రేమ అంత తోపేం కాదు
X

తొలి ప్రేమ.. ఈ భావన గురించి రాయని కవి లేడు. తొలిప్రేమ తాలూకూ మాధుర్యం మనిషి ఉన్నంత వరకూ ఉంటుంది. అందుకే ఆ పదానికి, ఆ ప్రేమకు చరిత్ర కూడా శాశ్వతమైన స్థానం ఇచ్చింది. కానీ తొలిప్రేమ అంత తోపేం కాదు అంటున్నాడు కిరణ్ అబ్బవరం. పైగా అసలు తొలిప్రేమ అంటే అంతా అనుకుంటున్నది కానే కాదు అని తేల్చి చెబుతున్నాడు. ఇదంతా ఎప్పుడు చెప్పాడూ అనుకుంటున్నారా.. ? అతని లేటెస్ట్ మూవీలోని సీన్ ఇది. బేబీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన టీమ్ ఈ సారి కిరణ్ అబ్బవరం, తెలుగు అమ్మాయి గౌరిప్రియ జంటగా మరో సినిమా రూపొందిస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తోందని చెప్పాలి. ఎస్కేఎన్, సాయి రాజేష్ ల నుంచి మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ రాబోతోందని ఈ ఫస్ట్ గ్లింప్స్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకుడు కాదు.. కథ అందించి నిర్మాతగా ఉన్నాడు. బేబీలాగానే ఎస్కేఎన్ మరో ప్రొడ్యూసర్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ రవి నంబూరి చేస్తున్నాడు.

ఇక గ్లింప్స్ చూస్తే.. ఓ సముద్రం ఒడ్డున హీరో హీరోయిన్ కూర్చుని ఉంటారు. అందమైన ఆ సంద్రముందు ఆమె తన మనసు విప్పి ‘బేబీ సినిమా చూశావా అంటుంది.. అతను ఊ.. అంటాడు. మొదటి ప్రేమకు మరణం లేదు. అది మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడుతుంది.. ’అంటూ ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా రాసుకున్నారు కదా అంటుంది. దానికి అతను నవ్వి ఊరుకుంటాడు. దీంతో తను రాయలేదా.. ? ఫస్ట్ లవ్ అది ఒకసారి ఫెయిల్ అయితే నరకం.. మొదటి ప్రేమలో ఒక ప్యూరిటీ ఉంటుంది.. నిజాయితీ ఉంటుంది.. ఆ తర్వాత వచ్చేవన్నీ .. అంటుండగానే అతను అందుకుంటాడు.. ‘మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలూ తల్లి ప్రేమదగ్గరే ఆగిపోవాలి కదండీ.. అమ్మే కదండీ.. మనందరి ఫస్ట్ లవ్. చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమకథలున్నాయి. వాళ్లందరికీ అవి మొదటి ప్రేమలైతే కాదుగా.. ఫస్ట్ లవ్ ఫెయిలందంటే.. బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని.. ఒకేచోట కదలకుండా కూర్చుంటే కాలు కూడా తిమ్మిరెక్కుతుంది. మనసు కూడా అంతేనండీ.. ఒక్కసారి కదిపి చూడండి.. మెల్లగా అడుగులేస్తూ.. అదే పరుగులు పెడుతుంది.. అంతేకానీ వాడెవడో తొలిప్రేమ.. నా సమాధి బొ.. బోషాణం అంటే అది పట్టుకుని కూర్చుకుంటారేంటండీ.. అలా అయితే నేనూ చాలా చెబుతా ’అంటాడు. దానికి ఆమె ఏమని..? అని అడుగుతుంది. అప్పుడు అతను అంటాడు.. ‘‘తొలిప్రేమ అంత తోపేం కాదని’’ అంటాడు.

ఇదంతా అద్భుతమైన సెటప్ లో మనసుకు హత్తుకునే డైలాగ్ డెలిరీస్ తో ఆకట్టుకునేలా రూపొందించాడు దర్శకుడు రవి నంబూరి. విశేషం ఏంటంటే.. ఈ చెన్నై లవ్ స్టోరీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ గ్లింప్స్ తోనే ఆయన మూవీకి మ్యాజిక్ చేయబోతున్నాడు అనిపించేశాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని గ్లింప్స్ తో ప్రకటించారు. మొత్తంగా సాయి రాజేశ్, ఎస్కేఎన్ మరో ఫీల్ గుడ్ మూవీతో వస్తున్నారని ఫిక్స్ అయిపోవచ్చు.

Tags

Next Story