Vicky Kaushal : వీకెండ్ లో కలెక్షన్స్ తో అదరగొట్టిన ఛావా

Vicky Kaushal :  వీకెండ్ లో కలెక్షన్స్ తో అదరగొట్టిన ఛావా
X

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా అక్షయ్ ఖన్నా, అషుతోష్ రానా, డయానా పెంటీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఛావా ఫస్ట్ డే నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ ను కలెక్షన్స్ గా టర్న్ చేయడంలో మౌట్ టాక్ మరింత బాగా పనిచేసింది. ఈ యేడాది బాలీవుడ్ కు ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోంది ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన దినేష్ విజన్ నిర్మించాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం హైలెట్ గా నిలుస్తోందనే టాక్స్ వస్తున్నాయి.

ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథతో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త యావరేజ్ అనే టాక్ వచ్చింది. అలాగే హిస్టరీని డీటెయిల్డ్ గా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు.. ఎమోషన్స్ కంటే యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అనే విమర్శలు ఉన్నా.. చివరి 40 నిమిషాలు నెక్ట్స్ లెవల్ ఎమోషన్స్ తో పాటు విక్కీ కౌశల్ అద్భుత నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఆ సీక్వెన్స్ తోనే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొదటి రోజు రెహమాన్ సంగీతం బాలేదు అన్నారు కానీ.. తర్వాత అదే హైలెట్ అనే టాక్ స్టార్ట్ అయింది. ఈ మొత్తం కలిపి సినిమాకు కలెక్షన్లూ తెస్తున్నాయి.

మొదటి రోజే విక్కీ కౌశల్ కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మూడు రోజుల్లో కలిపి 116 కోట్లు వసూళ్లు సాధించింది ఛావా. అంటే వీకెండ్ స్ట్రాంగ్ గా వర్కవుట్ అయిందన్నమాట. కేవలం హిందీ వెర్షన్ లోనే విడుదలైనా దేశవ్యాప్తంగా మంచి ఆదరణే ఉందీ చిత్రానికి. కాకపోతే ఈ వీక్ డేస్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి మూవీ సక్సెస్ రేట్ డిసైడ్ అవుతుంది. ఇప్పటికైతే ఈ మూవీ ఓవరాల్ గా 300 కోట్లు కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి ట్రేడ్ లో. మరి చేస్తుందా లేదా అనేది ఈ సోమవారం కలెక్షన్లను బట్టి తేలిపోతుంది.

Tags

Next Story