Chhaava OTT Date : ఓటిటిలోకి ఛావా.. ఎప్పుడంటే

దేశవ్యాప్తంగా అద్బుతమైన విజయాన్ని అందుకున్న సినిమా ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి చాలా గొప్ప రివ్యూస్ వచ్చాయి. ప్రధానంగా హిందూత్వ అజెండాతో రూపొందిన సినిమాలా కనిపించడంతో ఆ వర్గాలన్నీ సినిమాను ఓన్ చేసుకున్నాయి. కట్ చేస్తే కలెక్షన్ల వర్షం కురిసింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ వర్సెస్ ఔరంగజేబ్ కోణంలో సాగిన కథనం ఆద్యంతం ఆకట్టుకుంది. చివరి అరగంటకు ఆడియన్స్ కంట తడి పెట్టుకున్నారు. మరోవైపు అవాస్తవాలతో దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడనే విమర్శలు కూడా బలంగానే వినిపించాయి. ఓ దశలో శంభాజీ కుటుంబమే దర్శకుడిపై పరువు నష్టం దావా వేశారు. దీంతో చాలా వరకూ కల్పిత కథే అంటూ పబ్లిక్ గా క్షమాపణలు వేడుకున్నాడు దర్శకుడు లక్ష్మణ్. అయినా ఆ సినిమా ప్రేక్షకులను కదిలించింది. ఇదే చరిత్ర అనుకునేలా చేసింది. ఏదైతేనేం.. బొమ్మ బ్లాక్ బస్టర్. తర్వాత తెలుగులోనూ డబ్ చేస్తే ఇక్కడ హిందీ స్థాయి రెస్పాన్స్(కలెక్షన్స్ పరంగా) రాలేదు కానీ.. బాగానే ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఛావా ఓటిటిలోకి రాబోతోంది. ఏప్రిల్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. అయితే నెట్ ఫ్లిక్స్ వారికి 8 వారాల నిబంధన ఉంటుంది. అలా చూస్తే ఆ డేట్ లో కాస్త మార్పులు కనిపించొచ్చు. అదీ కూడా ఒకటీ రెండు రోజులు అటూ ఇటూగానే ఉంటుంది. మొత్తంగా సమ్మర్ లో మరోసారి శంభాజీ ప్రతాపం చూసేందుకు రెడీ అవ్వొచ్చన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com