Rishabh Shetty : కాంతార హీరో శివాజీ సినిమా వచ్చేది అప్పుడే

Rishabh Shetty :  కాంతార హీరో శివాజీ సినిమా వచ్చేది అప్పుడే
X

కాంతార మూవీతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి. ఈ చిత్రానికి దర్శకుడుగానూ గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కన్నడ నుంచి కేజీఎఫ్ తర్వాత కాంతారనే ప్యాన్ ఇండియా మూవీ అయింది.దీంతో ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ చేస్తున్నాడు. కాంతార - చాప్టర్ 1 అనే పేరుతో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీని ఈ యేడాది అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. మరోసారి హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్నీ అతనే డైరెక్ట్ చేస్తున్నాడు.

కాంతారతో పాటు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' మూవీలోనూ నటిస్తున్నాడు రిషబ్ శెట్టి. కొన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. అయితే రిషబ్ ప్రస్తుతం కాంతార 1 పైనే ఫోకస్ చేశాడు. అందుకే కాస్త ఆలస్యం కావొచ్చు. ఇది కాక ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హను మాన్ మూవీకి కూడా కమిట్ అయి ఉన్నాడు.సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇవాళ ఛత్రపతి శివాజీ బర్త్ డే సందర్భంగా 2027 జనవరి 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ లోగా రిషబ్ నుంచి ఈ కాంతార 1తో పాటు జై హను మాన్ కూడా రావొచ్చేమో. ఈ రెండూ విజయం సాధిస్తే అతను కూడా తిరుగులేని ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడు.

Tags

Next Story