Allu Arjun vs Chhava : అల్లు అర్జున్ కు పోటీగా ఛావా

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 15నే విడుదల కావాల్సిన ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం కొత్త డేట్ గా డిసెంబర్ 6 చెబుతున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీపై మొన్నటి వరకూ భారీ అంచనాలున్నాయి. ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కాస్త తేడాగా కనిపిస్తోంది. అయితే సినిమా బావుంటే ఇవేం పనిచేయవు. ఈ మూవీతో ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ కు ఇప్పటి వరకూ డిసెంబర్ 6 అనేది సోలో రిలీజ్ డేట్ గానే ఉంది. అయితే పుష్పరాజ్ కు బాలీవుడ్ లో మాత్రం భారీ షాక్ తగలబోతోంది.
డిసెంబర్ 6న బాలీవుడ్ మూవీ ‘ఛావా ’ విడుదల చేస్తున్నాం అనితాజాగా టీజర్ తో పాటు ప్రకటించారు.
ఉరీతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చకున్న విక్కీ కౌశల్ హీరోగా నటిస్తోన్న మూవీ ఛావా. కొన్నాళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరోలకు హిట్స్ లేవు. అయితే లేటెస్ట్ గా విడుదలైన ఛావా టీజర్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. లక్ష్మణ్ ఊటేకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ కథగా వస్తుండటం విశేషం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కనిపిస్తోంది.ఈ తరహా కంటెంట్ నే ప్రస్తుతం బాలీవుడ్ కోరుకుంటోంది. అందుకే ఛావా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనుకుంటున్నారు. ఈ మూవీ బాలీవుడ్ తో పాటు నార్త్ మొత్తం పుష్ప 2 కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
విశేషం ఏంటంటే.. ఛావాలోనూ శ్రీవల్లే హీరోయిన్. అదే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే ఈ మూవీలోనూ హీరోయిన్. ఈ మూవీలో తన పాత్ర పేరు యేసుబాయి భోన్సాలే. అంటే ఒకే రోజు శ్రీ వల్లిగానూ, యేసుబాయీగానూ నార్త్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతోందన్నమాట. మొత్తంగా అల్లు అర్జున్ కు తెలుగు మార్కెట్ కు ప్రాబ్లమ్ వచ్చింది. అటు మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు అక్కడా మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒక్కటే.. పుష్ప 2కు అవుట్ స్టాండింగ్ అన్న టాక్ రావాలి. లేదంటే పుష్పరాజ్ రైజింగ్ కష్టం.. అంతే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com