సినిమా

Naga Anvesh: టాలీవుడ్ యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్..

Naga Anvesh: ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా మారారు.

Naga Anvesh: టాలీవుడ్ యంగ్ హీరో ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్..
X

Naga Anvesh: ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా మారారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తింపు తెచ్చుకొని ముందుకెళ్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటించిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమా గుర్తుందిగా.. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్నే సృష్టించింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అయితే ఇందులో వెంకటేశ్ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నాగ అన్వేష్.

చిన్నప్పుడే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న నాగ అన్వేష్.. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి కుమారుడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది ఒక్క సినిమానే అయినా.. అందరికీ గుర్తుండిపోయాడు. ఇక కొన్నేళ్ల తర్వాత 'వినవయ్య రామయ్య' అనే సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యాడు. ఈ సినిమా హిట్ అయినా తనకు మాత్రం అంతగా గుర్తింపు దక్కలేదు.

ఇక తన రెండో సినిమా 'ఏంజెల్' కూడా నాగ అన్వేష్‌కు పెద్దగా పాపులారిటీ తీసుకురాలేకపోయింది. దీంతో సినిమాలకు దూరమయ్యాడు అశ్విన్. ఇక తాజాగా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన యజమాని కుమార్తె కావ్య బాలితో ప్రేమలో పడ్డ అశ్విన్.. ఇటీవల తనను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES