Singer Chinmayi Sripaada: మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన అతిథులు: చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్

Singer Chinmayi Sripaada: మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన అతిథులు: చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్
X
Singer Chinmayi Sripaada: చిత్ర పరిశ్రమకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చారు. ఆ ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు..

Singer Chinmayi Sripaada: చిత్ర పరిశ్రమకు చెందిన భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చారు. ఆ ఆనంద క్షణాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.. తన మధురమైన గొంతుతో ఎన్నో పాటలు పాడుతున్న చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భర్త రాహుల్ రవీంద్ర తెలియజేశారు. చిన్నారుల చిట్టి చేతులను షేర్ చేశారు. మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన అతిధులు 'ద్రిప్తా మరియు శర్వాస్' జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిధులు అని రవీంద్ర రాసుకొచ్చారు.

చిన్మయి, రాహుల్ మే 2014లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకులలో చిన్మయి ఒకరు. గురు, చెన్నై ఎక్స్‌ప్రెస్, తమిళ చిత్రాలు 96, కన్నతిల్ ముత్తమిట్టల్, మరియన్, ఏం మాయ చేశావే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మజిలీ వంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆమె పాటలు పాడారు. ముఖ్యంగా సమంతకు ఆమె డబ్బింగ్ చెబుతారు..

ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే నటుడిగా, డైరెక్టర్ గా విభిన్న కోణాలు ప్రదర్శిస్తారు.. రీసెంట్ గా ఆయన నటించిన నానీ చిత్రం శ్యాం సింగరాయ్ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. రవీంద్ర దర్శకత్వం వహించిన చిలసౌ హిట్ టాక్ తెచ్చుకుంది. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

చిన్మయి మరో పోస్టులో.. "నేను గర్భవతిగా ఉన్న చిత్రాలను పోస్ట్ చేయనందున, సర్రోగేట్ ద్వారా నాకు కవలలు పుట్టారా అని నన్ను డిఎమ్ చేస్తున్న వారిని నేను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం నా సన్నిహితులకు మాత్రమే తెలుసు. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల సర్కిల్ గురించి నేను ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను. మా పిల్లల ఫోటోలు కూడా చాలా కాలం పాటు సోషల్‌ మీడియాలో ఉండవు." అంటూ మరో పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చింది.

ఆమె ఇలా కూడా రాసింది, "మా చిన్నారులు ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు నేను నిజంగా సిజేరియన్ సమయంలో *భజన పాడాను* అని మీకు తెలియాలంటే దాని గురించి పట్టు సాధించండి. దీని గురించి మరింత వివరణ తర్వాత. కానీ ప్రస్తుతానికి ఇది సరిపోతుంది." అని రాసుకొచ్చారు. ఈ జంటకు అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story