Acharya : పవన్ కోసం ఆచార్య స్పెషల్ షో..!

Acharya : పవన్ కోసం ఆచార్య స్పెషల్ షో..!
Acharya : మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రామ్ చరణ్ సిద్దా అనే ఓ కీరోల్ ప్లే చేశాడు.

Acharya : మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన మూవీ ఆచార్య.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రామ్ చరణ్ సిద్దా అనే ఓ కీరోల్ ప్లే చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నారు.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.

అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ తో దర్శకుడు హరీశ్‌శంకర్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించారు. అందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఆచార్య సినిమాను ఎప్పుడు చూపించబోతున్నారని హరీశ్... చిరంజీవిని అడగగా .. దానికోసం ప్రత్యేకంగా ఓ థియేటర్ బుక్ చేసినట్టుగా చిరంజీవి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అందరం కలిసి ఆ థియేటర్ లోనే సినిమాని చూస్తామని చిరు చెప్పుకొచ్చాడు.

అయితే స్పెషల్ షో ఎప్పుడు.. ఎక్కడ ? అన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆచార్య సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story