సినిమా

Chiranjeevi : ఆచార్యలో మిస్.. ఈసారి ఫిక్స్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వెంకీ కుడుముల డైరెక్షన్‌‌లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Chiranjeevi : ఆచార్యలో మిస్.. ఈసారి ఫిక్స్
X

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వెంకీ కుడుముల డైరెక్షన్‌‌లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన దర్శకుడు వెంకీ.. పాత్రల ఎంపికల పైన ఫోకస్ పెట్టారట. కథలో ఇద్దరు హీరోయిన్లుగా స్కోప్ ఉందట.. అందులో భాగంగానే ఒక హీరోయిన్‌గా ఇప్పటికే శృతిహాసన్‌‌ని ఫైనల్ చేయగా, మరో హీరోయిన్‌‌గా త్రిషని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే త్రిషను సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. కాగా చిరంజీవి, త్రిష కలిసి ఇప్పటికే స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఆచార్య సినిమాలో నటించాల్సి ఉంది. కానీ వేరే కారణాల వల్ల త్రిష ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీనితో ఆమె ప్లేస్‌‌లో కాజల్ అగర్వాల్‌‌ని హీరోయిన్‌‌గా తీసుకున్నారు. అలా మిస్ అయిన చిరు, త్రిష కాంబినేషన్ మళ్ళీ వెంకీ కుడుములతో సెట్ కాబోతుందని చెప్పలి.

Next Story

RELATED STORIES