RRR Movie : RRR ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ లుగా చిరు, బాలయ్య..!

RRR Movie : కరోనా వలన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన RRR మూవీ ఫైనల్ గా మార్చి 25 న రిలీజ్ కానుంది.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పిర్యాడికల్ మూవీలో యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తేజ్ కలిసి నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్ హీరోయిన్ సీతగా నటించింది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడట రాజమౌళి.. త్వరలో జరగబోయే ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్ లుగా హాజరుకానున్నారట. మెగా, నందమూరి నటవారసులు ఈ సినిమాలో కలిసి నటించడంతో చిరు, బాలయ్యని ఆహ్వానించారట మేకర్స్.. త్వరలోనే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com