Puneeth Rajkumar James : పునీత్ కోసం మెగాస్టార్, ఎన్టీఆర్..!

Puneeth Rajkumar James : కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్'.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మార్చ్ ఆరున నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ లుగా ఆహ్వానించారట. దీనికి వీరిద్దరూ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది. చిరంజీవి, ఎన్టీఆర్.. పునీత్ రాజ్‌కుమార్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు.
కాగా చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జేమ్స్ సినిమాలో పునీత్ సరసన ప్రియాఆనంద్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో పునీత్ పాత్రకి ఆయన అన్నయ్య శివరాజ్‌కుమార్ కన్నడలో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. కాగా పునీత్ గత ఏడాది అక్టోబరు 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com