Chiru - Nag : మెగాస్టార్ - కింగ్ నాగ్.. వీళ్ల ఏజ్ వెనక్కి వెళుతోందా..?

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున. ఒకే తరం హీరోలు. చిరు కాస్త సీనియర్. వీళ్లు హీరోలుగా కెరీర్ మొదలుపెట్టే ఇప్పటికే 40 యేళ్లు దాటింది. మెగాస్టార్ వయసు 70కి దగ్గరగా ఉంది. నాగ్ ఆయనకంటే ఓ నాలుగేళ్లు వెనక ఉన్నాడు. బట్ ఈ ఫోటోస్ చూసిన వాళ్లంతా వీళ్లేంటీ ఇంత యంగ్ గా ఉన్నారు.. అసలు వయసు అయిపోతుందా.. లేక వెనక్కి వెళుతుందా అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. అంత యంగ్ లుక్ తో కనిపిస్తున్నారీ ఇద్దరు టాప్ స్టార్స్. ఇంకా చెబితే కొందరైతే.. వీళ్లు ఇంకా ఘరానా మొగుడు, ఘరానా బుల్లోడు కాలంలోనే ఆగిపోయారు అనే కమెంట్స్ కూడా పెడుతున్నారు.
ఇంతకీ ఈ సందర్భం ఏంటంటే.. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీదుగా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తుంది కదా ఆయన కుటుంబం. ఈ సారి ఆ అవార్డ్ ను మెగాస్టార్ కు ఇవ్వబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ నెల 28న అవార్డు ప్రదానోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించాడు నాగార్జున. ఆ సందర్భంగా తీసిన ఫోటోస్ ఇవి. చూసిన వాళ్లంతా వాళ్ల స్టైలిష్ యంగ్ లుక్ కు ఫిదా అయిపోతున్నారు. అన్నట్టు ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. 28న అన్నపూర్ణ స్టూడియోస్ లో అవార్డ్ కార్యక్రమం జరగబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com