Chiranjeevi_ Pawan Kalyan: మెగా బ్రదర్స్ ఖాతాలో అరుదైన రికార్డు...!

Chiranjeevi_ Pawan Kalyan: మెగా బ్రదర్స్ ఖాతాలో అరుదైన రికార్డు...!
Chiranjeevi_ Pawan Kalyan: వకీల్‌‌సాబ్ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Chiranjeevi_ Pawan Kalyan: వకీల్‌‌సాబ్ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ సినిమా బాక్సాఫీస్‌‌ ని షేక్ చేసి పవర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపించింది. తాజాగా భీమ్లానాయక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ సూపర్ సక్సెస్ కొట్టాడు.. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా సినిమా అదరగొడుతోంది.

ఈ సినిమా USA బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 2 మిలియన్ వసూళ్ళను సాధించింది. ఇక చిరంజీవి రీఎంట్రీ మూవీగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 కూడా USA బాక్సాఫీస్ వద్ద $2 మిలియన్ల పైగా వసూళ్ళను సాధించింది. అయితే USAలో మొత్తం 19 తెలుగు సినిమాలు 2 మిలియన్లకి పైగా వసూళ్లను సాధించాయి. అందులో రెండు రీమేక్‌లు మాత్రమే ఉన్నాయి.అవే చిరు ఖైదీ నెంబర్ 150, పవన్ భీమ్లానాయక్ చిత్రాలు కావడం విశేషం.

వివి వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 తమిళ్ లో విజయ్ హీరోగా వచ్చిన కత్తి సినిమాకి రీమేక్ కాగా, మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story