Chiranjeevi Pawan Kalyan: ఒకే షూటింగ్ సెట్‌లో చిరు, పవన్.. వీడియో షేర్ చేసిన చరణ్..

Chiranjeevi Pawan Kalyan: మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిసి కనిపించినా.. ఫ్యాన్స్ సంతోషంగా హద్దులు ఉండవు. అందుకే సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు కనిపించిన లైకులు మీద లైకులు వచ్చేస్తుంటాయి. అందులోనూ ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిస్తే.. ఆ గ్రేసే వేరు. అయితే తాజాగా వీరిద్దరు షూటింగ్ సెట్స్‌లో కలిశారు. దీనికి సంబంధించిన వీడియోను సంతోషంగా తన ట్విటర్‌లో షేర్ చేశాడు రామ్ చరణ్.
ప్రస్తుతం మెగా హీరోలంతా ఎవరి సినిమా షూటింగ్‌లో వారు బిజీగా ఉన్నారు.పవన్ కళ్యాణ్ ఇటీవల తన భీమ్లా నాయక్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్.. రానాతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమయ్యింది.
మరోవైపు చిరు.. 'గాడ్ ఫాదర్' షూటింగ్‌ను ప్రారంభించారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇటీవల భీమ్లా నాయక్ సెట్‌లోకి చిరంజీవి, గాడ్ ఫాదర్ సెట్‌లోకి పవన్ కళ్యాణ్ వెళ్లారు. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా తయారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు మెగా అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు.
#GODFATHER and #BHEEMLANAYAK visit each other's film sets!#BheemlaNayakOn25thFeb @KChiruTweets @PawanKalyan pic.twitter.com/oGo9XuPuax
— Ram Charan (@AlwaysRamCharan) February 24, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com